Documentation

AI Strategy Finder

మీ AI strategies, portfolios, history

AI Strategy Finder తెరవండి ↗

AI strategies ఉంచుకోవడం, కలపడం, పాత AI searches వెతకడం.

My strategies: మీరు ఉంచుకున్న AI strategies

#

పైన రెండు switches ఉంటాయి: Saved | Bought మరియు Trading | Investing | All. Saved లో మీరు Save తో ఉంచుకున్న ప్రతి strategy ఉంటుంది; Bought లో మీరు కొన్న ప్రతి strategy ఉంటుంది, save చేసినా చేయకపోయినా, కొత్తది ముందు — అక్కడి నుంచే దాన్ని open చేయండి లేదా deploy చేయండి (మీ account లో set అయ్యాక button మీద Deployed అని వస్తుంది); investing strategy కి అక్కడ alert గంట ఉంటుంది (alert పెట్టాక Alert on). Page Saved మీద open అవుతుంది, ఇంకా ఏదీ save చేయకపోతే Bought మీద. Investing strategy page తెరవండి; Alert పక్కన Deployతో దాన్ని Investing Terminalకి పంపవచ్చు.

మీరు save చేసిన ప్రతి strategy, save చేసినప్పటి numbers తో: trades, ₹ లో net profit, win %, profit factor, ఎన్ని tests pass అయిందో. పేరు పక్కన pencil నొక్కి అక్కడే కొత్త పేరు రాయండి, కింద Add a note లో మీ మాటలు; bin అడిగి strategy ని తీసేస్తుంది. మీరు 200 వరకు strategies save చేయొచ్చు; 200 అయ్యాక కొత్తది save చేయాలంటే ఒకటి delete చేయండి. కొన్న strategies ఈ 200 లో లెక్కలోకి రావు.

Run all on the latest data ప్రతి saved strategy ని data లోని కొత్త రోజు దాకా ముందుకు నడిపి, ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కడుందో చూపిస్తుంది: signal ఇప్పుడు వస్తోందా, position తెరిచి ఉండేదా, నిన్నటి P&L, save చేశాక వచ్చిన trades, దాని చివరి 20 trades. ఒక్కో strategy కి 1 credit.

My strategies page, Saved (4) మీద, పక్కన Bought (5), Trading, Investing, All switch: Daily position report card, తర్వాత నాలుగు saved strategies వాటి numbers తో, 8 tests ticks, Add to portfolio, కొన్న రెండింటికి Deploy, delete bin.
My strategies, Saved మీద.

AI strategies portfolios

#

Portfolio అంటే కలిసి trade అయ్యే saved strategies గుంపు. ప్రతి strategy లోని ప్రతి trade టైం వరుసలో ఒకే list గా కలుపుతారు, అన్ని numbers — profit, drawdown, win rate, నెల వారీ table — ఆ కలిపిన list నుంచే వస్తాయి.

New portfolio తో చేయండి, లేదా ఏ strategy మీద అయినా Add to portfolio తో. Portfolio లోపల ప్రతి strategy కి Lots, Capital ₹ పెట్టొచ్చు, రెండు strategies ఒకేసారి signal ఇస్తే Take both లేదా Only one position at a time ఎంచుకోవచ్చు, Each strategy's part, నెల వారీ table, correlation matrix చూడొచ్చు (ఒకే రోజుల్లో గెలిచి-ఓడే strategies తక్కువ రక్షణ ఇస్తాయి; అలాంటి జంటలు ఎరుపులో, సంబంధం లేనివి లేదా వ్యతిరేకంగా కదిలేవి ఆకుపచ్చ వైపు కనిపిస్తాయి).

Portfolio లో ప్రతి strategy పక్కన ఒక tick box ఉంటుంది. Tick తీసేస్తే ఆ strategy numbers లో లెక్కకు రాదు — అన్ని అంకెలు వెంటనే మారతాయి, ఎన్ని strategies కలిపారో పైన కనిపిస్తుంది. Tick తీసిన strategy list లోనే ఉంటుంది, మళ్ళీ tick పెట్టొచ్చు. ప్రతి strategy పక్కన ఉన్న bin దాన్ని portfolio నుంచి పూర్తిగా తీసేస్తుంది (My strategies లో ఉంటుంది). ప్రతి పేరు కింద దాని timeframe, దిశ, intraday ఆ positional ఆ, index ఆ options ఆ కనిపిస్తాయి.

ప్రతి strategy capital మొదట index strategy కి ₹2 L (index future ఒక lot), options కొనడానికి ₹50,000, options అమ్మడానికి ₹2 L, ప్రతి lot కి; మీ సొంత అంకె రాసి మార్చొచ్చు. Starting capital అంటే tick చేసిన strategies capital మొత్తం, అందుకే tick తీస్తే దాని capital కూడా తగ్గుతుంది. Run నొక్కితే portfolio లెక్క తయారవుతుంది: అంతకుముందు ఏమీ కనిపించదు, తర్వాత numbers అలాగే ఉంటాయి — వాటంతట అవే update కావు. Portfolio backtest card లో dates ఉంటాయి (మొదట data లో చివరి ఒక సంవత్సరం), చివరిసారి ఎప్పుడు, ఏ dates మీద, ఎన్ని strategies తో నడిచిందో చెబుతుంది; అక్కడే వేరే dates ఎంచుకుని Run again నొక్కండి. ప్రతి run కి tick చేసిన ఒక్కో strategy కి 1 credit (5 strategies = 5 credits); lots, capital, ticks, costs గత run నే మళ్ళీ లెక్కిస్తాయి, free. గత run తర్వాత కలిపిన లేదా tick చేసిన strategy మళ్ళీ run చేసేవరకు అందులో లెక్కకు రాదు.

Portfolios list లో Compare column లో ఒక portfolio మీద tick పెడితే దాని numbers, profit chart కనిపిస్తాయి; ఇంకా tick పెడితే అన్నీ పక్కపక్కనే కనిపిస్తాయి. Portfolios మీరు చేసిన వరసలోనే ఉంటాయి. పేరు పక్కన pencil నొక్కి అక్కడే కొత్త పేరు రాయండి; bin అడిగి portfolio ని తీసేస్తుంది (దాని strategies saved గానే ఉంటాయి). New portfolio Portfolio 1, 2 … పేరుతో తెరుచుకుంటుంది, పైన పేరు వెంటనే మార్చొచ్చు.

My first portfolio అనే portfolio page — కలిపిన profit, drawdown, win rate tiles, రెండు strategies వాటి lots తో.
రెండు sample strategies తో ఒక portfolio.

Search History

#

Search History (ఎడమ menu లో) లో మీరు మొదలుపెట్టిన ప్రతి search, కొత్తది ముందు, దాని status, దానికి ఏం దొరికింది, ఎంత టైం పట్టిందో తో. ఆకుపచ్చ గుర్తు అంటే అది అన్ని tests pass అయిన strategies ఇచ్చింది. Search ని తెరవొచ్చు, నడుస్తుండగా cancel చేయొచ్చు, delete చేయొచ్చు (దాని నుంచి save లేదా buy చేసిన strategies My strategies లో, మీ portfolios లో అలాగే ఉంటాయి). ఒకేసారి రెండు searches నడుస్తాయి. ప్రతి title ఏం వెతికారో చెబుతుంది — index, chart, Directional ఆ Non-directional ఆ, strategy type (Long only, Short only, లేదా Long / short chosen by AI), Intraday ఆ Positional ఆ. దాని కింద: Trades: Index లేదా Trades: Options (Buy ATM weekly), trading గంటలు, trade ఎలా తీసుకున్నారు, dates. Search సొంత page లో కూడా ఇదే title కనిపిస్తుంది. Searches 30 రోజులు ఉంటాయి, తర్వాత వాటంతట అవే పోతాయి; మీరు save చేసిన, కొన్న, లేదా portfolio లో పెట్టిన strategies అవే numbers తో ఎప్పటికీ ఉంటాయి.

History page లో పూర్తైన searches, కొత్తది ముందు — trading, investing, directional, non-directional — ప్రతి దాని details, status done, ఏం దొరికింది, ఎంత టైం పట్టింది, delete bin తో.
Searches History.